బెస్టాఫ్‌ లక్‌ మై యంగ్‌ ఫ్రెండ్స్‌ : ఇంటర్‌ విద్యార్థులకు ఏపీ సీఎం శుభాకాంక్షలు!

  • ఎటువంటి ఒత్తిడికి గురికావద్దు
  • ప్రశాంతంగా పరీక్షలు రాయండి
  • మీ శ్రమ, సాధనకు ఫలితం రాబట్టే సమయం ఇదే
ఏపీలో ఈరోజు నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో మెసేజ్‌ పోస్టు చేశారు. ‘బెస్టాఫ్‌ లక్‌ మై యంగ్‌ ఫ్రెండ్స్‌. ఎటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇన్నాళ్ల మీ కష్టం, సాధనకు తగిన ఫలితం రాబట్టే సమయం ఇదే. మీ లక్ష్యం దరికి తప్పక చేరుస్తుంది’ అంటూ ట్వీట్‌చేశారు.

ఏపీలో ఈరోజు నుంచి జరగనున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,46,368 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు అరగంట ముందే విద్యార్థులను నిర్వాహకులు పరీక్ష హాల్‌లోకి అనుమతించారు.

Inter students
Exams
CM Jagan
Twitter

More Telugu News